ట్రంప్‌పై పక్కా ప్లాన్‌తోనే దుండగుడు కాల్పులు

ట్రంప్‌పై దుండగుడు ఓ ఇంటిపై నుంచే కాల్పులకు తెగపడినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ర్యాలీకి వచ్చిన అగంతకుడు తుపాకీతో భవనం పైకి వెళ్లడం చూసినట్లు చెప్పారు.

By :  Raju
Update: 2024-07-14 05:02 GMT

ట్రంప్‌పై కాల్పులు అమెరికా కాలమానం శనివారం సాయంత్రం 6. 15 గంటలకు జరిగాయి. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారి తెలిపారు. ప్రచార ర్యాలీకి వేలాదిమంది తరలివచ్చినట్లు చెప్పారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో కాల్పుల దృశ్యాలు, తర్వాత జరిగిన పరిణామాలన్నీ రికార్డయ్యాయి. కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమైన ట్రంప్‌ పోడియం కిందికి వంగి తనను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్‌ సర్వీసెస్‌ సిబ్బంది ఆయనకు రక్షణ వలయంగా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ట్రంప్‌పై దుండగుడు ఓ ఇంటిపై నుంచే కాల్పులకు తెగపడినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ర్యాలీకి వచ్చిన అగంతకుడు తుపాకీతో భవనం పైకి వెళ్లడం చూసినట్లు చెప్పారు. గన్‌తో ఓ అనుమానితుడు ఫిర్యాదు చేసినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయినప్పటికీ ట్రంప్‌ ప్రసంగించడం తమకు ఆందోళన కలిగించింది అన్నారు. అంతలోనే ట్రంప్‌పై కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరించారు.

ట్రంప్‌ వచ్చే సమయానికే అగంతకుడు బంగ్లా పైకి ఎక్కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఏఆర్‌ శ్రేణి సెమీ ఆటోమెటిక్‌ ఆటోమెటిక్‌ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. దుండగుడిని తుద ముట్టించిన తర్వాత అతడి నుంచి భద్రతా దళాలు ఆయుధాన్నిస్వాధీనం చేసుకున్నాయి. 

Tags:    

Similar News