మూడో రోజు స్వల్ప లాభాలతో ముందుకే

వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలనే నమోదు చేశాయి.

By :  Raju
Update: 2024-07-31 02:11 GMT

వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలనే నమోదు చేశాయి.టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు రాణించడం దీనికి కలిసి వచ్చింది. త్రైమాసిక ఫలితాల సీజన్‌ కావడం, కొన్ని సంస్థల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ముదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మొదటిసారి 5.5 లక్షల కోటల్ డాలర్ల (రూ. 460.91 లక్షల కోట్ల) మైలురాయిని చేరుకున్నది.

సెన్సెక్స్‌ పొద్దున 81,349.28 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. తర్వాత సూచీ పుంజుకుని లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 81,815.27 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అక్కడ అమ్మకాలతో వెనక్కి వచ్చిన సూచీ 99,56 పాయింట్ల లాభంతో 81,455.40 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.20 పాయింట్లు పెరిగి 24,847.30 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.72 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 79.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

Tags:    

Similar News