ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది.

By :  Vamshi
Update: 2024-07-22 06:02 GMT

తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నాది. ప్రధానంగా ఇవాళ (జులై 22వ తేదీ) ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొన్నారు.

ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని చెప్పారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నది ఉగ్రరూపం దాల్చింది. సోమవారం నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News