చిన్నారులపై వీధి కుక్కల దాడులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

చిన్నారులపై వీధి కుక్కలు దాడులకు తెగబడుతూ ప్రాణాలు తీస్తున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

By :  Raju
Update: 2024-07-18 08:42 GMT

చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల నుంచి పిల్లలను రక్షించడానికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని పేర్కొన్నది. వచ్చే వాయిదా పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

జీహెచ్‌ఎంసీ తరపున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,80,000 వీధి కుక్కలు ఉన్నాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయని ఏజీ హైకోర్టుకు తెలిపారు. రోడ్లపై వ్యర్థాల వల్లనే కుక్కల స్వైర విహారం ఎక్కువైందని, వ్యర్థాలను తొలిగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News