ప్రభుత్వం నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తోంది

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు

By :  Raju
Update: 2024-09-05 06:43 GMT

తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్‌ చేస్తున్నదని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు నివాసంలో మీడియాతో మాట్లాడతూ.. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నదని సంచనల ఆరోపణలు చేశారు. మేము ఎక్కడికి వెళ్లినా వారికి సమాచారం అందుతున్నది. మా వ్యక్తిగత సమాచారం ఎలా వస్తున్నది? అని కౌశిక్‌ ప్రశ్నించారు.సీపీ టెలీ కాన్ఫరెన్స్‌ పెట్టుకోవడం వ్యక్తిగత విషయం అన్న కౌశిక్‌ ఆయన ఫోన్‌ కూడా ట్యాప్‌ అవుతున్నదని చెప్పారు. మా ఫోన్లు చేయరని గ్యారెంటీ ఏమిటి? అని నిలదీశారు. పోలీస్‌ యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్‌, ప్రజల సేఫ్టివింగ్‌, అలాంటి పోలీసుల ఫోన్లను ట్యాప్‌ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 40 శాతం మందికే రుణాలు మాఫీ అయ్యాయని మిగిలిన వారికి కాలేదన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చెక్కులైనా పంపిణీ చేయడానికి ఎమ్మెల్యేలకు హక్కు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్‌ పార్టీవి కావాని, అవి ప్రజల సొమ్మని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి చెక్కులు పంచుతున్నారని విమర్శించారు. దీనిపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. సీపీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైనప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎందుకు స్పందించనలేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కౌశిక్‌ కోరారు.

Tags:    

Similar News