ఒలిపింక్స్‌లో తొలి పతకం..ఏ దేశానికంటే ?

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకల వేట షూరూ అయింది. ఈ సీజన్‌లో కజక్‌స్థాన్ తొలి పతకం గెలుచుకుంది.

By :  Vamshi
Update: 2024-07-27 09:51 GMT

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో కజక్‌స్థాన్ తొలి పతకం గెలుచుకుంది. 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ విభాగంలో ఆ దేశ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. మరోవైపు తొలి బంగారు పతకం సొంతం చేసుకున్న జట్టుగా చైనా నిలిచింది. ఫైనలో పోరులో రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై 16-12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇవాళ జరిగిన షూటింగ్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమిత-అర్జున్‌ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

మరో జోడీ వలరివన్‌- సందీప్‌ సింగ్ 626.3 పాయింట్లతో 12 స్థానానికి పరిమితమైంది. టాప్‌-4లో ఉన్న వారు ఫైనల్‌ పోరుకు అర్హత సాధిస్తారు. మరోవైపు, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా పోటీ పడనున్నారు. మహిళల్లో మను బాకర్, రిథమ్‌ సంగ్వాన్‌ జోడీ తలపడనుంది. ఇక రోయింగ్‌ పురుషుల సింగిల్‌ స్కల్స్‌ హీట్స్‌లో భారత్‌ తరఫున పోటీ చేసిన బాల్‌రాజ్‌ పన్వర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. హీట్‌ 1లో పోటీ చేసిన అతడు 7:07.11 నిమిషాల్లో అతడు రేసును పూర్తి చేశాడు

Tags:    

Similar News