నగరానికి జరమొచ్చింది

రాష్ట్రవ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. జ్వరం, జలుబు వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.

By :  Raju
Update: 2024-06-29 04:18 GMT

రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ఫీవర్‌ ఆస్పత్రికే రోజుకు సుమారు 600 నుంచి 700 మంది అనారోగ్యంతో వస్తున్నారని సమాచారం. పదుల సంఖ్యలో ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. దీనికితోడు డెంగ్యూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు చేసింది.

పెరుగుతున్న విష జ్వరాల నేపథ్యంలో గత పదిరోజులుగా ఫీవర్‌ ఆస్పత్రికి రోజూ 500-600 వరకు ఓపీ పెరుగుతున్నదని, అడ్మిషన్స్‌ కూడా పెరుగుతున్నాయిని ఆస్పత్రివర్గాలు చెప్పాయి. జూన్‌, జులైలో సీజన్‌ వ్యాధులు పెరగడమే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.. జలుబు, జ్వరం వంటి సమస్యలతో వస్తున్న వారికి అవసరమైన టెస్టులు చేస్తున్నామని, తప్పనిసరి అయితే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుంటున్నామని తెలిపాయి. సీజనల్‌ వ్యాధులు జూన్‌ నుంచి ఆగస్టు వరకు కొంత పెరుగతాయన్నారు. సీజనల్‌ వ్యాధుల్లో వైరల్‌ ఫీవర్‌ మాత్రమే కాకుండా టైయిఫాడ్‌ కేసులు చాలా పెరుగుతున్నాయన్నారు. లూజ్‌ మోషన్స్‌, వాంతులు, చికెన్‌పాక్స్‌ వంటి వ్యాధులతో పాటు కొన్ని డెంగ్యూ కేసులు వస్తున్నాయని తెలిపారు. హెపటైటీస్‌ కొన్ని కేసులు పెరుగుతున్నాయి. ఇలా కేసులు పెరుగుతుండటంపై తాము అప్రమత్తంగా ఉన్నామని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. జ్వరం, జలుబు వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ఏడాది దేశంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News