తెలంగాణ.. ప్యూచర్​ స్టేట్​:​ సీఎం రేవంత్

కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశంలో రాష్ట్ర లక్ష్యం సూచించే కొత్త నినాద ట్యాగ్​ లైన్​ సీఎం రేవంత్​ రెడ్డి ఖరారు

By :  Raju
Update: 2024-08-09 04:48 GMT

తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటీ సర్వీస్‌ అలయెన్స్‌ సమావేశంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌ ప్రస్తుతం పెట్టే ప్రతీ రూపాయి తప్పకుండా భవిష్యత్తుకు పెట్టబడిగా ఉపయోగపడుతుందని సీఎం వివరించారు.

రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్‌ నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులను చేపట్టిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ ఆర్టీఫిషియల్‌ ఇంటలీజెన్స్‌ టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచస్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని స్పష్టం చేశారు.

పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా సీఎం అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సాగుతున్నది. న్యాయార్క్‌, న్యూజెర్సీ, వాషింగ్టన్‌ డీసీ, డల్లాస్‌, టెక్సాస్‌లో పర్యటన పూర్తి చేసుకున్న సీఎం బృందం కాలిఫోర్నియాకు చేరుకున్నది. ఇప్పటికే పది కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా..వెస్ట్‌కోస్ట్‌లో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలకు సిద్ధమయ్యారు. సీఎంనేతృత్వంలోని రాష్ట్ర బృందంఇప్పటికే అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో పర్యటన పూర్తి చేసుకున్నది. తెలంగాణలోని పట్టణాభివృద్ధి, ఐటీ, హైదరాబాద్‌ నాలుగో దశ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణకు పది కంపెనీలు ముందుకు వచ్చాయి. అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియాలోనూ పెట్టబడుల అన్వేషణ కొనసాగనున్నది.

Tags:    

Similar News