రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ ఉద్యోగులు

భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు రూ.100 కోట్ల విరాళాన్ని తెలంగాణ ఉద్యోగులు ప్రకటించారు.

By :  Vamshi
Update: 2024-09-03 05:42 GMT

భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు రూ.100 కోట్ల విరాళాన్ని తెలంగాణ ఉద్యోగులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం రూ.100 కోట్ల ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్నామని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి ల‌చ్చిరెడ్డి తెలిపారు.తెలంగాణలో కురుస్తున్న వ‌ర్షాల‌తో భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని ఆయన అన్నారు. హీరో విశ్వక్ సేన్ ‌కూడా రూ.5లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు.

కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆలస్యంగా స్పందించారని కొందరు ముంపు గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వర్షాల వలన జరిగిన నష్టం అంతా ఇంతాకాదు. ప్రస్తుతం అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నందున సెలబ్రిటీలు ముందుకు వచ్చి సాయం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News