ఈ నెల 31 వరుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప‌ది రోజుల పాటు స‌భ‌ను నిర్వ‌హించాల‌ని బీఏసీ నిర్ణయించింది

Update: 2024-07-23 08:51 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 31వ తేదీ వరుకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజు నుంచి 8 రోజుల పాటు జరుగుతాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు మొదలైన సంగతి తెలిసిందే. 25న తెలంగాణ బడ్జెట్ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం మాత్రమే అసెంబ్లీకి సెలవు కలదు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజే బడ్జెట్ పై చర్చ నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News