సుప్రీం తీర్పు రేవంత్‌ సర్కార్‌కు చెంపపెట్టు: ప్రశాంత్‌రెడ్డి

రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విద్యుత్‌ విచారణ ఉన్నదని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-16 10:34 GMT

రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటం, సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగా తప్పుబట్టడం, ఛైర్మెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పడటమంటే ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మార్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. విచారణ పూర్తికాకముందే ప్రెస్‌మీట్స్‌ పెట్టడం తప్పని కోర్టు చెప్పింది.

అసెంబ్లీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, చింతా ప్రభాకర్, వివేకానంద్‌లతో కలిసి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విద్యుత్‌ విచారణ ఉన్నదని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లు అప్పటి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలేనని..అన్నీ సక్రమంగానే జరిగాయన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఛైర్మెన్ ఇష్టానుసారంగా మీడియాకు వివరాలు చెప్పారు.ఎలాగైనా కేసీఆర్ ను ఇలా ఇరికించాలని చూశారు.అందుకే సుప్రీం తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందని తెలిపారు.

తెలంగాణ సాధనే కరెంటు కోసమన్నారు. బీడు భూములు సస్యశ్యామలం చేసేందుకు కేకేఆర్ అనేక ప్రణాళికలు చేశారు. కరెంట్ ఇచ్చి పరిశ్రమలు కాపాడాలనే ఆయన బలమైన దీక్షతో కరెంట్ ఇచ్చారు. 24 గంటల కరెంట్ ఇస్తే దేశవ్యాప్తంగా కేసీఆర్ మంచి పేరు వస్తుందని బురద జల్లడానికి చిల్లర ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వానికి అదే రివర్స్ అయ్యిందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 

Tags:    

Similar News