నీట్ పరీక్షను రద్దు చేయాలని స్టూడెంట్ మార్చ్

లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ పరీక్షను చేయాలని, ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు

By :  Vamshi
Update: 2024-06-18 07:12 GMT

హైదరాబాద్‌లో నీట్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘా నేతలు డిమాండ్ చేశారు. లీకేజీ తో సంబంధం ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ప్రధాని మోదీ మౌనం విడాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నరని.. ఎగ్జామ్ రద్దు చేసి నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఎన్ ఎస్ యు ఐఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యు, విద్యార్థి జన సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, పివైఎల్ విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గోన్నారు.

Tags:    

Similar News