వర్గీకరణ తీర్పు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం

మంద కృష్ణ మాదిగతో భేటీ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ

Update: 2024-08-21 15:52 GMT

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ బుధవారం మంత్రి దామోదర, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ, సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రంలో త్వరితగతిన అమలయ్యేలా ఎమ్మెల్యేలు, దళిత మేధావులు, సామాజిక వేత్తలు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరుపాలని సూచించారు. ప్రభుత్వపరంగా తాము సీఎంతో మాట్లాడుతామని.. మేధావులు, సామాజికవేత్తలు కూడా చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మదుల సామేలు, మాదిగ మేధావులు ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ ఖాసీం, కాంగ్రెస్ నాయకులు కొండేటి మల్లయ్య, విజయ్ కుమార్, బాపిరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News