తొలిసారి ఫైనల్‌‌కు సౌతాఫ్రికా..56 పరుగులకే కుప్పకూలిన ఆప్గాన్

ఐసీసీ వరల్డ్ కప్‌ తొలిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది.

By :  Vamshi
Update: 2024-06-27 03:34 GMT

టీ20 వరల్డ్ సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 10 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 56 రన్స్‌కే ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్ అయింది. ఆప్గాన్ నిర్థేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. పస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్ డికాక్‌ను (5) ఫారుఖీ పెవీలియన్‌కు పంపించాడు. అయితే తర్వాత వచ్చిన మార్క్‌రమ్‌తో కలిసి రీజా హెండిక్స్‌ అలవోకగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇరువురు 23 రన్స్‌, 29 పరుగుల చొప్పున చేయడంతో 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగిసింది. కీలక మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా పేసర్లు చెలరేగారు.

పేసర్ మార్కో యన్‌సెన్, స్పిన్నర్ షంషీ చెరో 3 వికెట్లు తీయగా.. పేసర్లు కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 2, గుల్బాదిన్ నబీ 9, మహమ్మద్ నబీ 0, నంగేయలియా ఖరోటే 2, కరీం జనత్, రషీద్ ఖాన్ 8, నూర్ అహ్మద్ 0, నవీన్ ఉల్ హక్ 2, ఫరూఖీ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు సౌత్‌ఆఫ్రికా అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి.

Tags:    

Similar News