చిన్న షేర్లు.. భారీ లాభాలు

ఈ ఏడాది బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 27 శాతం వృద్ధి.

By :  Raju
Update: 2024-07-18 03:15 GMT

ఈ సంవత్సరంలో ఇప్పటివరకు చిన్న-మధ్యస్థాయి షేర్లు ఆకర్షణీయ ప్రతిఫలాన్ని మదుపర్లకు పంచాయి. దేశ స్థూల ఆర్థిక మూలాలు ఆశాజనకంగా ఉండటంతో పాటు, దేశీయంగా నగదు లభ్యత పెరగడం కలిసి వచ్చింది. ఈ ఏడాది జులై 16 వరకు బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ సూచీ 10,984.72 పాయింట్లు (29.81 శాతం) పెరిగింది. స్మాల్‌ క్యాప్‌ 11,628.13 పాయింట్లు (27.24 శాతం) రాణించింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ 30 షేర్ల ప్రామాణక సూచీ సెన్సెక్స్‌ 8,476.29 పాయింట్లే (11.73 శాతం) పెరగడం గమనార్హం.

బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ సూచీ జీవనకాల గరిష్ఠస్థాయి 48,175.21 పాయింట్లకు జులై 16న చేరింది. స్మాల్‌ క్యాప్‌ సూచీ జులై 8న 54,617.75 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. బీఎస్‌ఈ సూచీ కూడా జులై 16న 80,898.3 పాయింట్ల జీవనకాల గరిష్ఠస్థాయికి చేరింది.ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలం బుల్‌ రన్‌ను కొనసాగిస్తుండటంతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లోని స్టాక్‌లు మరింత రాణించే అవకాశం ఉన్నదని స్టాక్‌మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News