గుండెపోటుతో గాయని ఉషా ఊతుప్ భర్త కన్నుమూత

ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్‌ ప్రాణాలు కోల్పోయారు.

By :  Vamshi
Update: 2024-07-09 09:16 GMT

ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ హఠన్మరణం చెందారు. సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఇంటిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. టీవి చూస్తుండగా హార్ట్‌టాక్ రావడంతో జానీ చాకోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస వదిలారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

జానీ చాకోకు ప్రస్తుతం 78 ఏళ్లు.. జానీ చాకో ఊతుప్, ఉషా ఊతుప్ దంపతులకు ఇద్దరు సంతానం.. కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి. తండ్రి మరణంపై అంజలి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘నాన్నా.. మమ్మల్ని వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. ఎంతో స్టైలిష్‌గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి. నిన్ను మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని ఆ పోస్ట్ లో పోస్ట్ చేశారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరగనున్నట్లు టాక్.

Tags:    

Similar News