ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం: కేసీఆర్‌

ఏక కాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసమని అసెంబ్లీ వేదికగా దీన్ని ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు.

By :  Raju
Update: 2024-07-24 04:12 GMT

ఏక కాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసమని అసెంబ్లీ వేదికగా దీన్ని ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన కార్యాచరణపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన బీఆర్‌ఎస్‌ ఎల్పీ బడ్జెట్‌ వ్యూహాన్ని ఖరారు చేసింది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగుల సమస్యలు, అక్రమ అరెస్టులు, హామీల అమలులో వైఫల్యం, రుణమాఫీ, పౌర సరఫరాల శాఖలో కుంభకోణాలు, నకిలీ మద్యం వ్యవహారం, ఆర్టీసీ విలీనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, పెన్షన్లు, శాంతిభద్రతలు తదితర అంశాలను ఉభయసభల్లో లేవనెత్తాలని నిర్ణయించారు. ప్రధానంగా ఏకకాలంలో రుణమాఫీ అనేది ఒక మోసమని దీన్ని సభలో ఎండగట్టాలని కేసీఆర్‌ సూచించారు.

త్వరలోనే శాసససభ, మండలిలోనే కార్యవర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం 25, 26 తేదీల్లో మేడిగడ్డ, కన్నెపల్లిలో పర్యటించాలని బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షం నిర్ణయించింది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రాజెక్టులోకి నీళ్లు మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.

Tags:    

Similar News