పాక్‌కు షాక్..తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం
బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సేన పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది.
తొలి టెస్టులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. రావల్పిండి వేదికగా జరిగిన టెస్టుల్లో బంగ్లా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది.
స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది.ఒకదశలో డ్రా దిశగా సాగిన రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ అసమాన పోరాటం కనబరిచింది. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన బంగ్లా.. అనంతరం పాకిస్థాన్ బ్యాటర్లకు కళ్లెం వేసింది. దాంతో, డ్రా చేసుకునే అవకాశం ఉన్నాసరే పాక్ ఆటగాళ్లు కనీస పోరాటం చేయలేకపోవడంతో బంగ్లాకు గెలుపు దక్కింది.