భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

నేటి నుంచి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తారు

By :  Vamshi
Update: 2024-08-05 05:22 GMT

నేటి నుంచి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం తొలి సోమవారం కావటంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, కాళేశ్వరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, అమరావతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసంలో పండుగలు ఇలా ఉన్నాయి..

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో..ఈ నెల 8వ తేదీన నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఇవాళ (5వ తేదీ)న మొదటి సోమవారం 12, 19, 26 తేదీల్లో సోమవారాల్లో శివుడిని, 9, 16, 23, 30వ తేదీల్లో (శుక్రవారాలు) లక్ష్మీ దేవిని, 10, 17వ తేదీల్లో విష్ణుమూర్తిని పూజిస్తారు. 24,31వ తేదీల్లో (శనివారాలు). ఈ తేదీల్లో వచ్చే పండుగలతో అన్ని ఆలయాలు పూజా కార్యక్రమాలతో కళకళలాడుతున్నాయి. నేటి నుంచి శుభ ముహూర్తాలు మొదలు కానున్నాయి.

Tags:    

Similar News