మూడోరోజు నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌

ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో ప్రారంభ లాభాలను పోగొట్టుకున్న సెన్సెక్స్‌ వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిసింది.

By :  Raju
Update: 2024-08-07 04:19 GMT

ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో ప్రారంభ లాభాలను పోగొట్టుకున్న సెన్సెక్స్‌ వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్ల అండతో ఒక దశలో 1093 పాయింట్లు దూసుకెళ్లిన సూచీ, వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. సూచీల నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణనించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.439.59 లక్షల కోట్ల కు చేరింది. గత 3 ట్రేడింగ్‌ రోజుల్లో మదుపర్లు సుమారు రూ.22 లక్షల కోట్లు కోల్పోయారు. బ్యాంకింగ్‌, టెలికాం షేర్లు నిరాశకు గురిచేశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 78,981.97 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ ఇంట్రాడేలో 1,092.68 పాయింట్ల లాభంతో 79,852.08 వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 78,496.57 పాయింట్లకు పడిపోయింది. చివరికి 166.33 పాయింట్ల నష్టంతో 78,593.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 63.05 పాయింట్లు కోల్పోయి 23,992.55 దగ్గర స్థిరపడింది.

భారత్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు పెరిగి 83.92 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.30 శాతం లాభంతో 76.52 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

Tags:    

Similar News