80,000 పాయింట్ల ఎగువన ముగిసిన సెన్సెక్స్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి పెద్ద సంస్థలు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 80,000 ఎగువన ముగిసింది.

By :  Raju
Update: 2024-07-05 01:49 GMT

ఈక్విటీ సూచీలు గురువారం సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. కిందటి సెషన్‌లోనే 80,000 ఉన్నత శిఖరాలకు తాకి వెనక్కి వచ్చిన సెన్సెక్స్‌ మొదటిసాఇర ఆ స్థాయికి ఎగువన ముగిసింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి పెద్ద సంస్థలు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 80,000 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్ల వరకు ఎగిసి 80,392.64 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి 62.87 పాయింట్ల వద్ద లాభంతో మరో జీవితకాల గరిష్ఠస్థాయి 80,049.67 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా తాజా గరిష్ఠానికి చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దీనికి మద్దతుగా నిలిచాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక్క పైసా తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.52 శాతం నష్టంతో 89.89 డార్లర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది. ఆసియా మార్కెట్లలో షాంఘై నష్టపోగా...మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

ముదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ కూడా జీవితకాల గరిష్ఠమైన రూ. 447.30 లక్షల కోట్లు (5.36 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. 

Tags:    

Similar News