కాంగ్రెస్ నేతలు కమీషన్‌లు కోసమే ఇసుక టెండర్లు : బాల్క సుమన్

సీఎం రేవంత్ రెడ్డికి కమీషన్ల మీదున్న శ్రద్ద ప్రజల సమస్యల మీద లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆయన అన్నారు

By :  Vamshi
Update: 2024-06-19 08:41 GMT

మేడి గడ్డ బ్యారేజ్‌ను తెలంగాణ ప్రభుత్వం మరమ్మతులు చేయిస్తోందని భావించామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రేవంత్ సర్కార్ బ్యారేజ్‌ను రిపేర్ చేయక పోగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మీద నిందలు వేయడానికి ప్రయత్నించిందని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియతో మాట్లాడారు. మేడి గడ్డ బ్యారేజ్ నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుక ను తరలించేందుకు సర్కార్ టెండర్లు పిలిచిందని ఆయన తెలిపారు. ఇది కాంగ్రెస్ నేతల కమీషన్‌లు కోసమే టెండర్లు పిలిచారన్నారు.

ఈ టెండర్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమని..ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము కోర్టులను ఆశ్రయిస్తామని సుమన్ అన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖనిజాల వేలానికి డెడ్ లైన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని.. ఈ గనులు సింగరేణి కి ఇవ్వాలని మేము డిమాండ్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలి ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి తక్షణమే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు అన్నదమ్ముల్లా తెలంగాణ గనులు ప్రైవేటు వారికి ధారదత్తం చేయాలని ప్లాన్ వేసినట్టు ఉందని సుమన్ అన్నారు.

Tags:    

Similar News