మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెంచాలి : ఈటల

సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టారు.

By :  Vamshi
Update: 2024-08-25 11:40 GMT

సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందజేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం కార్మికుల జీతాలు పదివేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గుడ్లు, పాల ధరలను చెల్లించాలని కోరారు.

ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కడుపునిండా భోజనం లేదని, రక్తహీనతతో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నరని కారణంతో మధ్యాహ్న భోజన పథకం వచ్చిందని ఈటల అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూలీకి పోతుంటారు.. వారికి అన్నం పెట్టే ఆస్కారం లేదు, పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడితేనే అటెండెన్స్ కూడా ఎక్కువ ఉంటుందనే ఆలోచనతో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిందని ఈటల అన్నారు. ప్రతి నెల 5వ తేదీన శాలరీలు, బిల్లులు చెల్లించాలని కోరారు.

Tags:    

Similar News