రష్యా-ఉక్రెయిన్‌ల కొనసాగుతున్న భీకర దాడులు

రష్యా 200 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడగా..ప్రతీకారంగా రష్యాలోని ఎనిమిది ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతిదాడి చేసింది

By :  Raju
Update: 2024-08-26 16:11 GMT

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్‌లో15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న రష్యన్‌ బలగాలు బాంబుల వర్షం కరిపిస్తున్నాయి. 200 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. అర్ధరాత్రి మొదలైన ఈ దాడులు సోమవారం పొద్దున వరకు సాగినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు ఉక్రెయిన్‌ పౌరులు గాయపడ్డారు. తమ దేశంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసిన రష్యన్‌ బలగాలు బాంబుల వర్షం కురిపించినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.రష్యన్‌ క్రూయీజ్‌లు, డ్రోన్‌లు పడనట్లు వెల్లడించింది. రాజధాని కీవ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు పేర్కొన్నది. దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి.

శనివారం రష్యా జరిపిన దాడిలో ఓ బ్రిటన్‌ పాత్రికేయుడు మృతి చెందినట్లు ధృవీకరించింది. అందుకు ప్రతీకారంగా రష్యాలోని ఎనిమిది ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతిదాడి చేసింది. సరతోవ్‌లోని ఎత్తైన భవనంలోకి ఉక్రెయిన్‌ డ్రోన్‌ దూసుకెళ్లింది. ఈ దాడిలో ఇద్దరు గాయపడగా.. భవనంలోని కొంత భాగం ధ్వంసమైంది. మరోవైపు రష్యాలోని కుర్స్క్ ప్రాంతం లో మరో రెండు గ్రామాలు తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.తమ బలగాలు మూడు కిలోమీటర్లు దూసుకువెళ్లినట్లు చెప్పారు.

Tags:    

Similar News