ఆర్టీసీ బస్సు ఓవర్‌ లోడ్‌‌పై..కేటీఆర్ ఫైర్

నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓవర్‌ లోడ్‌ కారణంగా రైట్‌ సైడ్‌ రెండు టైర్లు ఊడిపోయాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Vamshi
Update: 2024-08-18 05:24 GMT

జగిత్యాల జిల్లా రాయికల్‌ ప్రధాన రహదారిపై బస్సు వెనుక రైట్‌ సైడ్‌ రెండు టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పరిమితి 47 మంది కాగా.. ఏకంగా 170 మంది ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్‌, కండక్టర్‌ జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్‌కు వస్తున్నారు. ఓవర్‌ లోడ్‌ కారణంగా జగిత్యాల రూరల్‌ మండలం మోరపెల్లి శివారుకు చేరుకోగానే.. బస్సు వెనుక రైట్‌ సైడ్‌ రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

ఒక్కసారిగా బస్సు కుదు­పునకు గురికావడంతో ప్రయాణి­కులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాక­పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులని ఎక్కించుకొని తీసుకెళ్లడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అమాయక ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు.వెంటనే అదనపు బస్సులు నడిపించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News