బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. వెలుగు చూస్తున్న ఘోరాలు

బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్‌ హసీనా పదవి నుంచి వైదొలిగాక అక్కడ కొన్నిరోజులు జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఘోరాలు విస్తుగొలుపుతున్నాయి.

By :  Raju
Update: 2024-08-07 06:21 GMT

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రధాని షేక్‌ హసీనా పదవి నుంచి వైదొలిగాక అక్కడ కొన్నిరోజులు జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఘోరాలు విస్తుగొలుపుతున్నాయి.. అల్లర్లలో అధికారపార్టీకి చెందిన అవామీ లీగ్‌ నేతలే మృతి చెందారు. వారిని ఊచకోత కోసినట్లు తెలుస్తోంది. 20 కి పైగా మృతదేహాలను గుర్తించారు. ఈ క్రమంలో బంగ్లా నటుడు షాంతో ఖాన్‌ను ఆందోళనకారులు కర్రలతో కొట్టిచంపారు. దాడిలో అతని తండ్రి, నిర్మాత సలీమ్‌ ఖాన్‌ కూడా మృతి చెందాడు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ బయోపిక్ నటించాడు.

బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ జీవితం, కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఆధారంగా సలీమ్‌ ఖాన్‌ 2021లో 'తుంగిపరార్‌ మియా భాయ్‌' పేరుతో సినిమా నిర్మించాడు. ఈ సినిమాలు ఆయన తనయుడు శాంతో ఖాన్‌ హసీనా తండ్రి రెహమాన్‌ యుక్తవయసు పాత్ర పోషించాడు. ఈ సినిమాతో అతని కెరీర్‌ మలుపు తిరగడమే కాకుండా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.

సోమవారం హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారన్న వార్త బైటికి రాగానే శాంతో, సలీమ్‌ను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రీ కుమారులు చాంద్‌పూర్‌లోని తమ స్వగ్రామానికి పారిపోవడానికి యత్నించారు. కానీ మార్గమధ్యలోనే ఆందోళకారులు అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం వాల్లు కాల్పులు జరపడానికి ప్రత్నించారు. ఆందోళన కారులు కర్రలతో దాడి చేసి అతి కిరాతకంగా చంపేశారు.

ఈ దేశం మనది, దీన్ని మనం నిర్మించుకోవాలి:ఖలేదా జియా

మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్రిక్తతలపై మాజీ ప్రధాని ఖలేదా జియా ఆందోళన వ్యక్తం చేశారు. హింస, విధ్వంస, లూటీలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ నాయకులు తెలిపారు. దేశంలోని వనరులు వృథా అవుతున్న ఖలేదా పేర్కొన్నారని, ఈ దేశం మనది, దీన్ని మనం నిర్మించుకోవాలని చెప్పినట్లు వాళ్లు వెల్లడించారు.

భారత హైకమిషన్‌ పనిచేస్తూనే ఉంటుంది

ఈ నేపథ్యంలో భారత హై కమిషన్‌ ఒక ప్రకటన చేసింది. బంగ్లా దేశ్‌లో భారత హైకమిషన్‌ పనిచేస్తూనే ఉంటుందని తెలిపినట్టు సమాచారం. ఢాకాలో పనిచేసే ఇతర సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ఎవరైనా భారత్‌కు తిరిగి రావాలంటే స్వచ్ఛందంగా వాణిజ్య విమానాల ద్వారా చేరుకోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News