ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌

ఏఐసీసీ పిలుపు మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ అంశం ఈరోజు సాయంత్రం వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఏఐసీసీ పెద్దల ఆమోదం పడితే రాత్రికి దీనిపై ప్రకటన చేయవచ్చు.

By :  Raju
Update: 2024-07-03 06:48 GMT

ఏఐసీసీ పిలుపు మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. భట్టి అక్కడికి చేరుకున్న తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలపై ఆయన హస్తిన పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నది. ఎంపీ కేకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమయంలో చేరనున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ అంశం ఈరోజు సాయంత్రం వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఏఐసీసీ పెద్దల ఆమోదం పడితే రాత్రికి దీనిపై ప్రకటన చేయవచ్చు. రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం, డిప్యూటీ సీఎం వివిధ శాఖల సమీక్ష సమావేశంలో ఉండగానే ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో రేవంత్‌ హుటాహుటిన హస్తినకు వెళ్లారు. డిప్యూటీ సీఎం అధికారులతో సమీక్ష ను కొనసాగిస్తున్నారు. సమావేశం అనంతరం ఆయన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు.అనంతరం ఖర్గేతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై ఏఐసీసీ ముఖ్యులతో చర్చించనున్నారు.ప్రధానంగా నాలుగు మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు మంత్రివర్గ విస్తర్ణలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News