వయనాడ్‌లో కొనసాగుతున్నరెస్క్కూ ఆపరేషన్‌

వయనాడ్‌లో మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌, డాగ్‌ స్క్వాడ్‌లను వినియోగిస్తున్నారు

By :  Raju
Update: 2024-08-04 10:19 GMT

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లోఆరవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వాలంటీర్లు సహా 1300 మంది సిబ్బందికి పైగా రెస్క్కూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు.ఇంకా చాలామంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్టు వయనాడ్‌ జిల్లా కలెక్టర్‌ మేఘశ్రీ తెలిపారు.

మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌, డాగ్‌ స్క్వాడ్‌లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటిఇవరకు 334 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలను వెలికి తీసినట్లు పేర్కొన్నది. మృతుల్లో 97 మంది పురుషులు, 88 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. 

Tags:    

Similar News