అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలి: కేటీఆర్‌

అత్యాచారాలు, సైబర్‌ క్రైమ్‌పై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్ష పడాలనికేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

By :  Raju
Update: 2024-08-02 05:23 GMT

బాధితులకు త్వరలో న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలని, సైబర్‌ క్రైమ్‌ బాధితులకు సత్వర న్యాయం అందాలని ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. శాసనసభలో సివిల్‌ కోర్టుల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. సైబర్‌ క్రైమ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలన్నారు. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని  డిమాండ్‌ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిది కాదని హెచ్చరించారు.. కొన్ని విషయాల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అత్యాచారాలు, సైబర్‌ క్రైమ్‌పై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రంలో భావ వ్యక్తీకరణకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్‌ వీడియోలు పెడుతున్నారని, సభలో జరిగిన కార్యక్రమాలపై వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ తమ సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదని తెలిపారు. అసెంబ్లీలో కెమెరాలన్నీ స్పీకర్‌ అధీనంలో ఉంటాయని వివరించారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననం జరుగుతున్నది. ప్రధానులు, సీఎంల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయన్నారు. ఈ బిల్లును బీఆర్‌ఎస్‌ సమర్థిస్తుందని చెప్పారు. 

Tags:    

Similar News