వరద బాధితులకు పూర్తి ఇన్సూరెన్స్‌ వర్తింపజేయండి

ప్రభుత్వరంగ బీమా కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశం

Update: 2024-09-05 14:17 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు పూర్తి బీమా సొమ్మును చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వరంగ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఆదేశించింది. ఈమేరకు గురువారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. వరద ప్రభావ ప్రాంతాల్లో వీలైనంత తర్వగా పాలసీదారులకు బీమా సొమ్ము చెల్లించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించింది. తమ బీమా సొమ్ము క్లెయిమ్‌ చేసుకోవడానికి ఇన్సూరెన్స్‌ చేయించుకున్న వారికి ఆయా కంపెనీలు సహకరించాలని కోరింది. బీమా క్లెయిమ్‌ కోసం ఎవరిని సంప్రదించాలి, నోడల్‌ ఆఫీసర్‌ ఎవరు అనే వివరాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, బీమా చేయించుకున్న వారికి వారి ఫోన్‌ నంబర్‌ సహా అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. వ్యక్తిగత, వాహన ఇన్సూరెన్స్‌ సహా, ఇతర బీమా సొమ్ము క్లెయిమ్‌ చేసుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విధంగా వెసులుబాటు కల్పించింది.

Tags:    

Similar News