ప్రైవేటు టీచర్లకూ సంరక్షణ చట్టం రావాల్సిందే: వినోద్‌

ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను కించపరిచేలా మాట్లాడారని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.

By :  Raju
Update: 2024-08-04 09:45 GMT

ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను కించపరిచేలా మాట్లాడారని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు తో కలిసి తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..

2009 ఆగస్టు లో విద్యా హక్కు చట్టం వచ్చింది .రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారింది. రాష్ట్రంలో మొత్తం 40 వేల 941 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 30 307 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల సంఖ్య లెక్కల విషయంలో కొంత వ్యత్యాసం ఉన్నది. మొత్తం 50 లక్షలు మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రైవేటులోనే 51 శాతం ఉన్నారు. వెనకబడిన ప్రాంతాల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ప్రైవేటు పాఠశాలలను రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదని సూచించారు.

ఈ పోటీ ప్రపంచంలో అవునన్నా కాదన్నా చాలామంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా తన మనుమలు, మనవరాళ్లను ప్రైవేటు స్కూల్ కే పరిస్థితే ఉంటుంది. ప్రైవేటు స్కూళ్ల లో పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు ..అది ఎవరి తప్పు? అని ప్రశ్నించారు. విద్యా హక్కు చట్టం కింద శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండాలి ..చాలా స్కూళ్లల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి సీఎం ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయుల పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వినోద్‌ డిమాండ్‌ చేశారు.

ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సంక్షేమ చట్టం లేదని, అసంఘటిత రంగం లో పని చేసే వారికి కూడా సంక్షేమ చట్టాలు ఉన్నాయి. తాను ఎంపీ గా ఉండగా ప్రైవేట్ స్కూళ్ల లో పని చేసే ఉపాధ్యాయులకు సంక్షేమ బోర్డు ఉండాలని ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా సెస్సు వసూలు చేసైనా ప్రైవేటు ఉపాధ్యాయులకు సంరక్షణ బోర్డు ఉండాలన్నారు. ఎంతోమంది నైపుణ్యం ఉన్న వాళ్ళను సమాజానికి అందిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్య విషయంలో తెలంగాణ అనేక రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉన్నామని, దీనికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పాత్ర సమంగా ఉందన్నారు.ఈ విద్యా సంవత్సరం లో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలల్లోకి వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్న టీచర్ల కు సంరక్షణ చట్టం తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వంపై కూడా సంరక్షణ చట్టంపై ఒత్తిడి చేయాలి. త్వరలోనే లక్షమంది ప్రైవేట్ ఉపాధ్యాయులతో సభ పెట్టి సంరక్షణ చట్ఠం కోసం ఒత్తిడి తెస్తామన్నారు. గతంలో మాజీ స్పీకర్ జి .నారాయణ రావు చొరవతో న్యాయవాదులకు సంక్షేమ చట్టం వచ్చింది .అన్ని రాష్ట్రాల్లో ఇది అమలవుతున్నది. ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా సంరక్షణ చట్టం రావాల్సిందేనని వినోద్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News