నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని

వయనాడ్‌లో కేత్రస్థాయి పరిస్థితులను ప్రధాని తెలుసుకోనున్నారు.

By :  Raju
Update: 2024-08-10 04:49 GMT

కేరళలోని వయనాడ్‌ కొండచరియలు విరిగిపడిన ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రకృతి బీభత్సానికి వయనాడ్‌ ప్రాంతం అతలాకుతలమైంది. అక్కడ చనిపోయిన వారి శవాలను వెలికి తీయడానికి, మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌, డాగ్‌ స్క్వాడ్‌లను వినియోగించి ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వాలంటీర్లు చాలా శ్రమించాయి. కొంతమందిని ప్రాణాలతో కాపాడగలిగాయి.ఈప్రకృతి ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు.

ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్‌లో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూర్‌ విమానాశ్రయానికి 11 గంటలకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఏరియల్‌ సర్వే ద్వారా ద్వారా అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తారు. ఆ తర్వాత వయనాడ్‌లోని పలు శిబిరాలను, ఆస్పత్రులను సందర్శిస్తారు. అక్కడ కొండ చరియలు విరిగిపడి గాయపడిన వారిని ప్రధాని పరామర్శించనున్నారు. ఆ తర్వాత మోడీ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొండ చర్యలు విరిగిన పడిన ఘటన, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ఆయనకు అధికారులు వివరంగా తెలియజేయనున్నారు. వయనాడలో జులై 30న కొండ చరియలు విరిగి పడటంతో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రధాని పర్యటనపై విపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయం అన్నారు. ఇప్పటికైనా వయనాడ్‌ ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరకుంటున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News