మ‌నూ భాక‌ర్‌‌‌ను అభినందించిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి

ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు గెలిచిన భారత షూట‌ర్ మ‌నూ భాక‌ర్‌‌పై ప్ర‌శంస‌లు వెలువెత్తున్నాయి

By :  Vamshi
Update: 2024-07-30 11:18 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత షూట‌ర్ మ‌నూ భాక‌ర్‌‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అభినందించారు. ఈ విజయం ఆమె అంకిత భావానికి నిదర్శమని మోదీ తెలిపారు. షూట‌ర్ల ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని రాష్ట్రపతి అన్నారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు గెలిచిన తొలి భార‌తీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.. మ‌నూ భాక‌ర్ తొలుత మ‌హిళ‌ల‌10మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో, ఆ త‌ర్వాత 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య ప‌త‌కాలు గెలిచింది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం గెలిచింది.

మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో దక్షిణ కొరియా ద్వయం జుయీ లీ- వోన్షోలీపై మను-సరబ్‌జోత్ జోడీ 16-10తో విజయం సాధించింది. 1900 సంవ‌త్స‌రంలో నార్మ‌న్ ప్రిచార్డ్ గ‌తంలో భార‌త్‌కు ఒకే ఎడిష‌న్‌లో రెండు ప‌త‌కాలు అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌ర‌పున రెండు ఒలింపిక్స్ ప‌త‌కాలు సాధించిన వాళ్ల‌లో ప్రిచార్డ్‌, సుశీల్ కుమార్‌ (2008,2012) పీవీ సింధు (2016,2020) భాక‌ర్ ఉన్నారు. వారిలో ప్రిచార్డ్‌, భాక‌ర్ మాత్రం ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు సాధించారు. ఇక సుశీల్‌, సింధులు.. వేర్వేరు ఒలింపిక్స్‌లో ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నారు.మరోవైపు పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News