పొంగులేటికి సీఎం కుర్చీపై వ్యామోహం ఎక్కువగా ఉన్నది: ఏలేటి
కాంగ్రెస్‌లో మూడు వర్గాలున్నాయన్న ఏలేటి పొంగులేటి రాష్ట్రంలో డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలియకుండానే కొడంగల్‌లో వేల కోట్ల రూపాయాల కాంట్రాక్టులు తెచ్చుకున్నారంటే పొంగులేటి పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
తెలంగాణ మంత్రులకు పరిపాలన కన్నా సీఎం కుర్చీపై వ్యామోహం ఎక్కువగా ఉన్నదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లో మూడు వర్గాలున్నాయన్న ఏలేటి పొంగులేటి రాష్ట్రంలో డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలియకుండానే కొడంగల్‌లో వేల కోట్ల రూపాయాల కాంట్రాక్టులు తెచ్చుకున్నారంటే పొంగులేటి పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ. వేలాది కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి కన్ను సీఎం కుర్చీపై పడిందేమో అని ఆరోపించారు.
కొంతమంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని అధిష్ఠానాన్ని భయపెడుతున్నారా? లేదా పన్ను కడుతున్నారు కాబట్టి పరిహారంగా ఈ వేల కోట్ల కాంట్రాక్టులు అడుగుతున్నారా? చెప్పాలని ఏలేటి నిలదీశారు.