జన్వాడ ఫాంహౌస్‌ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్‌

రాజకీయ కారణాలతో నా ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని పిటిషనర్‌ ప్రదీప్‌రెడ్డి

By :  Raju
Update: 2024-08-21 06:02 GMT

జన్వాడ ఫాంహౌస్‌ కూల్చవద్దంటూ ప్రదీప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్‌, రంగారెడ్డి కలెక్టర్‌, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులు, శంకర్‌పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్‌ ఇంజినీర్‌లను చేర్చారు.

ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్ పరిధిలో తన ఫాంహౌస్‌ లేదంటూ పిటిషనర్‌ ప్రదీప్‌రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌కు 30 మీటర్ల పరిధిలోనూ ఫాంహౌస్‌, పొలం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 14న నా ఫాంహౌస్‌ను నీటిపారుదల శాఖాధికారులు పరిశీలించారు. అప్పుడు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నా ఫాంహౌస్‌ లేదని ఆధారాలు చూపెట్టాను. అయినా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే నిర్మాణం ఉన్నదంటూ అధికారులు వాదించారని, రాజకీయ కారణాలతో నా ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Tags:    

Similar News