టాలీవుడ్‌ పరిస్థితులపై మా సమావేశం

టాలీవుడ్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులపై మా అధ్యక్షుడు మంచు విష్ణు మా సభ్యులతో కలిసి సమావేశమైయ్యారు.

By :  Vamshi
Update: 2024-07-30 12:41 GMT

టాలీవుడ్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులపై మా అధ్యక్షుడు మంచు విష్ణు మా సభ్యులతో కలిసి సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా పలు అంశలపై చర్చించారు. ముఖ్యంగా నటులపై సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్, ఫేక్ న్యూస్, వీడియోలను సృష్టిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. సినీ నటులకు మా ఎప్పుడు అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నటీనటులను విమర్శిస్తూ అసత్య వార్తలను వండివారుస్తున్న యూట్యూబ్ చానళ్లపై ఫిర్యాదు చేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఇటీవల 18 చానళ్లను రద్దు చేయించింది.

మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీనా ప్రశంసించారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. ఫేక్ న్యూస్ ప్రజల్లోకి తీసుకెళుతున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకున్న ‘మా’కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు ఆ పోస్టులో మీనా పేర్కొన్నారు. ఇండస్ట్రీ సమగ్రతను విష్ణు కాపాడుతున్నారని, ఆయన అంకితభావం అభినందనీయమని ప్రశంసించారు. నెగటివ్ కామెంట్స్‌ను నిరోధించడంతోపాటు సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. విష్ణు చాలా మంచి పని చేశారని మీనా కొనియాడారు.

Tags:    

Similar News