చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By :  Raju
Update: 2024-07-20 14:32 GMT

చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రకటించారు. వాటిలో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 8, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ ఉద్యోగాలు 22 ఉన్నట్లు తెలిపారు.

ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆమె వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిన మూడేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News