పాఠశాలల్లో ఇకపై స్పోర్ట్స్ పీరియడ్ : భట్టి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు.

By :  Vamshi
Update: 2024-08-27 06:51 GMT

జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరిగేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వహణ కోసం అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. క్రీడలకు నిధుల కొరత లేదని, అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఆటల ద్వారా వచ్చే స్ఫూర్తి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గత పాలకుల నుంచి వచ్చిన క్రీడా సముదాయాలను, ఆస్తులను మరమ్మతులు చేసి అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News