రికార్డుస్థాయి గరిష్ఠానికి నిఫ్టీ

గరిష్ఠస్థాయిలో ఆటుపోట్లు ఎదుర్కొన్న సెన్సెక్స్‌ స్వల్ప నష్టాలతో ముగియగా నిఫ్టీ మాత్రం ఒత్తిని తట్టుకుని తాజా రికార్డు గరిష్ఠస్థాయికి చేరింది.

By :  Raju
Update: 2024-07-06 02:23 GMT

శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ గరిష్ఠస్థాయిలో ఆటుపోట్లు ఎదుర్కొన్న సెన్సెక్స్‌ స్వల్ప నష్టాలతో ముగియగా నిఫ్టీ మాత్రం ఒత్తిని తట్టుకుని తాజా రికార్డు గరిష్ఠస్థాయికి చేరింది. సెన్సెక్స్‌ రికార్డు స్థాయిల నుంచి దిగజారింది. ఆఖర్లో కోలుకున్న సూచీ 53.0 పాయింట్ల వద్ద నష్టంతో 79,996,60 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లో ఇది అనిశ్చిత పరిస్థితిని సూచిస్తున్నది. వరుసగా మూడోరోజూ లాభపడిన నిఫ్టీ 21.70 పాయింట్ల లాభంతో జీవికాల గరిష్ఠస్థాయి 24,323.85 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 963.87 పాయింట్లు, నిఫ్టీ 313.25 పాయింట్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 0.70 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 0.75 శాతం లాభపడ్డాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రిస్‌, ఎస్‌బీఐ షేర్లు రాణించగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్‌ డీలా పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.49 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 87 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఇష్యూకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో గ్రూప్‌ ప్రధాన సంస్థ రియయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇంట్రాడేలో 3 శాతం పెరిగి రూ. 3,197.65 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరింది. చివరికి 2.32 లాభంతో రూ. 3180 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 55,286.61 కోట్లు పెరిగి రూ. 21.58 లక్షల కోట్లకు చేరింది. 

రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఇష్యూకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో గ్రూప్‌ ప్రధాన సంస్థ రిలయన్స్‌ ఇండ్రస్టీస్‌ షేరు ఇంట్రాడేలో 3 శాతం పెరిగి రూ.3197.65 వద్ద 52 వారాల గరిష్ఠానికి తాకింది. చివరికి 2.32 శాతం లాభంతో రూ. 3,180 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 55.286 కోట్లు ఎరిగి రూ. 21.58 లక్షల కోట్లకు చేరింది.

Tags:    

Similar News