నిఫ్టీ @ 25,000

చరిత్రలో మొదటిసారి నిఫ్టీ 25,000 పాయింట్ల రికార్డు శిఖరాన్ని చేరుకున్నది.

By :  Raju
Update: 2024-08-02 02:55 GMT

బుల్‌ మరోసారి దూసుకెళ్లింది. మదుపర్ల కొనుగోళ్ల జోరుతో సూచీలు మరో రికార్డు మైలురాయిని చేరాయి. చరిత్రలో మొదటిసారి నిఫ్టీ 25,000 పాయింట్ల రికార్డు శిఖరాన్ని చేరుకున్నది. సెన్సెక్స్‌ 82,000 పాయింట్లను చేరుకుని వెనక్కి వచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల కోతలను ప్రారంభిచవచ్చు అన్న అంచనాలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి.

సెన్సెక్స్‌ ఉదయం 81,949.68 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగించిన సూచీ ఇంట్రాడేలో 82,129.49 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణలో వెనక్కి వచ్చి, చివరికి 126.21 పాయింట్ల లాభంతో 81,857.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్లు పెరిగి 25,010.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 25,078.30 వద్ద కొత్త రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి 83.73 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 81 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

Tags:    

Similar News