కమలా హారిస్‌కు నెట్‌ఫ్లిక్స్‌ భారీ విరాళం

హారిస్‌ ప్రచారానికి ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ప్రకటించింది. హారిస్‌కు ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు హేస్టింగ్స్‌. రూ. 58.6 కోట్ల విరాళం ఇచ్చారు.

By :  Raju
Update: 2024-07-28 03:35 GMT

డెమెక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమౌతున్న కమలా హారిస్‌కు మద్దతు పెరుగుతున్నది. బైడెస్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో డెమోక్రటిక్‌ పార్టీకి, రిపబ్లికన్‌ పార్టీకి 6 శాతం ఓట్ల తేడా ఉండగా ప్రస్తుతం అది 1 శాతానికి తగ్గిపోయింది. తాజా పోల్‌లో అమెరికా ఓటర్లలో ట్రంప్‌నకు 48 శాతం మద్దతు ఇవ్వగా.. హారిస్‌కు 47 శాతం మంది మద్దతుగా నిలిచారు. న్యూయార్క్‌ టైమ్స్‌, సియానా కాలేజీ ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఈ నేపథ్యంలోనే హారిస్‌ ప్రచారానికి ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ప్రకటించింది. హారిస్‌కు ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు హేస్టింగ్స్‌. రూ. 58.6 కోట్ల విరాళం ఇచ్చారు. హేస్టింగ్స్‌ ఇప్పటివరకు రాజకీయ పార్టీకి ఇచ్చి అది పెద్ద విరాళం ఇదే. నిరాశ పరిచిన బైడెన్‌ డిబేట్‌ తర్వాత మళ్లీ గేమ్‌లోకి వచ్చామని హేస్టింగ్స్‌ ట్వీట్ చేశారు.

మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌ను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 

Tags:    

Similar News