పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ ఫలితాలు వెల్లడించండి: సుప్రీం

నీట్‌-యూజీ ఫలితాలను జూలై 20 మధ్యాహ్నానికి కేంద్రాల వారీగా, నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

By :  Raju
Update: 2024-07-18 15:33 GMT

నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ, పరీక్షలో నిర్వహణలో అవకతవకై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్‌ ఫలితాలను ఈ నెల 20న వెల్లడించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)ను ఆదేశించింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా నీట్‌ ఫలితాలను ప్రకటించాఇ ఎన్టీఏను ఆదేశించింది.

ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోనూ వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నది. 'నీట్‌-యూజీ' సంబంధిత పిటిషన్లను జులై 22న తిరిగి విచారిస్తామని పేర్కొన్నది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలు కనిపించకుండా చూడాలని సూచించింది.

పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు రుజువైతేనే రీ-టెస్ట్‌కు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. సీబీఐ తమకు తెలిపిన వివరాలను బయటపెట్టలేమని, వెల్లడిస్తే విచారణపై ప్రభావం పడుతుందని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.

నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై జులై 22న విచారణ జరగనున్నది.

మరోవైపు పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సీబీఐ అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన వారంతా పట్నా ఎయిమ్స్‌ విద్యార్థులే.

Tags:    

Similar News