రాజ్యసభలో పేరు వివాదం... విపక్ష ఎంపీల వాకౌట్‌

రాజ్యసభలో పేరు వివాదం మరోసారి గందగోళాన్ని సృష్టించింది. ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఎంపీ జయాబచ్చన్‌ను జయా అమితాబ్‌ బచ్చన్‌ అని సంభోదించడమే దీనికి కారణం.

By :  Raju
Update: 2024-08-09 09:25 GMT

రాజ్యసభలో పేరు వివాదం మరోసారి గందగోళాన్ని సృష్టించింది. ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఎంపీ జయాబచ్చన్‌ను జయా అమితాబ్‌ బచ్చన్‌ అని సంభోదించడమే దీనికి కారణం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జయా బచ్చన్‌ గతంలోనూ ఇలాగే సంబోధించారని అలా పిలవొద్దని తాజాగా చెప్పారు. దీంతో నాకు పాఠాలు బోధించవద్దని ధన్‌ఖడ్‌ అనడంతో చైర్మన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. ఛైర్మన్‌ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా కలిసి వాకౌట్‌ చేశారు. జయాబచ్చన్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ మద్దతుగా నిలిచారు.

దీనిపై జయా బచ్చన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఛైర్మన్‌ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మేం పాఠశాల విద్యార్థులం కాదు. మాలో కొందరు సీనియర్‌ సిటిజన్లు కూడా ఉన్నారు. విపక్ష నేత మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించిందన్నారు. మైక్‌ కట్‌ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి తాను పట్టించుకోను అంటూ తీవ్ర పదజాలం ఉపయోగిస్తుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. నేను ఐదోసారి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నాకు తెలియదా ఏం మాట్లాడాలో? ఇలాంటి ప్రవర్తన గతంలో ఎన్నడూ చూడలేదని, దీనిపై చైర్మన్‌ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News