రేవంత్‌ పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, లైంగికదాడులు పెరిగాయి: ఎన్‌వీఎస్‌ఎస్‌

రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు, లైంగికదాడులు పెరిగాయని, క్షిణించిన శాంతిభద్రతలు క్షీణించాయని వీటిపై సమీక్షంచాల్సిన హోం మంత్రి (సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-04 08:06 GMT

రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటినా.. సీఎం ఢిల్లీ యాత్రలతోనే సరిపోతున్నదని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు. నలుగురు నాయకుల మధ్య కాంగ్రెస్‌ ఇరుక్కున్నదన్నారు. రాష్ట్రంలో హత్యలు, లైంగికదాడులు, అరాచకత్వం పెరిగిందని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. హత్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు, లైంగికదాడులు పెరిగాయని, క్షిణించిన శాంతిభద్రతలు క్షీణించాయని వీటిపై సమీక్షంచాల్సిన హోం మంత్రి (సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిని పరిష్కరించకుండా కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏం లాభం అన్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం సీఎం ఢిల్లీ బాట పట్టడంతో పాలన పడకేసిందన్నారు. ఖజానా ఖాళీ అయ్యిందన్నారు.

మరోవైపు ఈ నెల 6వ తేదీన ఏపీ, తెలంగాణ సీఎం సమావేశం జరగనున్నది. ఈ భేటీ జరగాలని మేము కూడా కోరుకుంటున్నామన్నారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని ముందుకు వెళ్తే మంచిదే అన్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి ఉన్నదా? అని ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రశ్నించారు. 

Tags:    

Similar News