అమ్మ పేరిట 520 మిలియన్లకు పైగా మొక్కలు నాటాం: భూపేంద్ర యాదవ్‌

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుంచి నేటి వరకు 520 మిలియన్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపిన కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌

By :  Raju
Update: 2024-09-03 08:26 GMT

అమ్మ పేరిట మొక్క కార్యక్రమంలో భాగంగా 520 మిలియన్లకు పైగా మొక్కలు నాటామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ఇటీవల వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి అని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు ప్రారంభించిన మూడు నెలల్లో 520 మిలియన్లకు పైగా మొక్కలు నాటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

గత దశాబ్దంలో భారతదేశం అనేక సమిష్టి ప్రయత్నాలను చేపట్టింది. ఇది దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి దారితీసిందని, ఇది అందరికీ చాలా సంతోషాన్నిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల బుద్ధ జయంతి పార్క్‌లో మొక్క నాటి సందర్భంగా వ్యాఖ్యానించారు. . సుస్థిరాభివృద్ధి వైపు మన అన్వేషణ గొప్పది. స్థానిక కమ్యూనిటీలు ఈ సందర్భంగా ఇందులో ముందుండటం కూడా అభినందనీయమని మోదీ అన్నారు.

వ్యవసాయ శాఖలోని కిసాన్ కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మా అన్ని కార్యాలయాలలో, మా శాఖ ఉద్యోగులు ఈ రోజు మొక్కలు నాటారని మరో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. భవిష్యత్ తరాలకు ఈ భూమిని సురక్షితంగా ఉంచి పర్యావరణ రక్షణకు కావాల్సినంత ఆక్సిజన్‌ పొందడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన కోరారు. 

Tags:    

Similar News