టాలీవుడ్ హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ..విషెస్ తెలిపిన ఎన్టీఆర్

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి మరో నందమూరి హీరో ఎంట్రీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

By :  Vamshi
Update: 2024-09-06 10:58 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రశాంత్‌వర్మ్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ టైటిల్ అలాగే పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఓ పోస్టర్ మాత్రం విడుదల చేసింది సినీ యూనిట్. సోషల్ మీడియాలో మోక్షజ్ఞకు ప్రశంసలు వెల్లెవెత్తున్నాయి. తాజాగా హీరో ఎన్టీఆర్ ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు. సినీ ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు.

నూతన అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు దేవుడి ఆశీర్వాదాలు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే మోక్షు అని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టేంత ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కల్యాణ్‌ రామ్‌ పేర్కొన్నారు. హ్యాపీ బర్త్ డే మోక్షజ్ఞ. నీ అరంగేట్రం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. రానున్న సంవత్సరంలో నువ్వు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నా అని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.

Tags:    

Similar News