ఎమ్మెల్సీ బ‌ల్మూర్‌ వెంక‌ట్‌కు వాసుదేవా రెడ్డి సవాల్

ఈ ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో నిరుద్యోగుల‌కు రేవంత్‌రెడ్డి ఒక్క కొత్త నోటిఫికేష‌న్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బ‌ల్మూర్‌ వెంక‌ట్‌ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

By :  Vamshi
Update: 2024-06-18 11:35 GMT

సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి 7నెలలు వ్యవధిలో నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేష‌న్ అయినా ఇచ్చారా అని ఎమ్మెల్సీ బ‌ల్మూర్‌ వెంక‌ట్‌ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో వాసుదేవా రెడ్డి మీడియాతో మాట్లాడారు. బల్మూర్ వెంకట్ మాజీ మంత్రి హరీష్ రావు గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎటు పోయింది.

జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అసెంబ్లీ ఎన్నికల్లో నిరుగ్యోగులను రెచ్చగొట్టి వారి కోసం మ్యానిఫెస్టో పెట్టిన మీరు ఈ రోజు ఆ అంశాల‌పై మాట్లడరెందుకు? బల్మూర్ వెంకట్‌తో చర్చకు హరీష్ రావు కాదు నేను వస్తా.. నిరుద్యోగుల డిమాండ్లపై చర్చిద్దామన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల్లో పోస్టుల సంఖ్య‌ను పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. వారిని కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు బెదిరిస్తున్న‌ట్లు నిరుద్యోగులు వాపోతున్నారు. ఖబడ్డార్ కాంగ్రెస్ నాయకుల్లారా నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోము. హరీష్ రావు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు సమస్యల కోసం వచ్చే వారికి భోజనం పెట్టి సమస్య పరిష్కరించేవారు. హరీష్ రావు 14 ఏండ్లు ఉద్యమం, 10 ఏండ్లు అధికారంలో ఉన్న నిఖార్సయిన ఉద్యమకారుడి గురించి మాట్లాడే స్థాయి వెంకట్‌ది కాదు. పెద్ద‌ల‌ సభకు వెళ్లిన బల్మూర్ వెంక‌ట్ త‌న స్థాయి దిగ‌జారి మాట్లాడొద్దని వాసుదేవా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

Tags:    

Similar News