ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

ఉజ్జయిని మహంకాళి బోనాలకు జూలై 5 లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అని అధికారులను హెచ్చారించారు

By :  Vamshi
Update: 2024-06-27 06:13 GMT

జులై 21,22 వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 5 లోపే నగరంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 21 వ తేది బోనాలు ,అమ్మవారి దర్శనం కార్యక్రమాలు ఉండగా, 22 వ తేది ఉదయం 9 గంటలకు రంగం మరియు గజాదిరోహణ మహోత్సవం అంబారి పై అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఉండనుందాన్నారు.

ఈసారి మహ లక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. మహంకాళి బోనాలు అంటేనే హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట ఉంటుందని ఈసారి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో 20 కోట్లు విడుదల చేశారని తెలిపారు. 

Tags:    

Similar News