మేయర్ విజయలక్ష్మి వీడియోలు మార్ఫింగ్.. వ్యక్తి అరెస్ట్

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మార్పింగ్ వీడియోలను పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By :  Vamshi
Update: 2024-08-10 15:02 GMT

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మార్పింగ్ వీడియో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన చామకూరి లక్ష్మణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ పోస్టులు ఉద్దేశపూర్వకంగానే వైరల్ చేస్తున్నారని గుర్తించిన పోలీసులు.. ఈ పోస్టులు వైరల్ చేయించిన ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

తన మార్పింగ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మేయర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా, తనను టార్గెట్ చేస్తూ కొంతమంది కావాలనే అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని.,వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు

Tags:    

Similar News