పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కామాటిపురలోని ఓ డెకరేషన్ సామాగ్రి గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.

By :  Vamshi
Update: 2024-08-13 12:14 GMT

హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కామాటిపురలోని ఓ డెకరేషన్ సామాగ్రి గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకున్నాయి. వెంటనే అగ్ని మాపక సిబ్బంది వచ్చి పరిశ్రమలో కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 5 ఫైరింజన్‌లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్ట్రం జరగలేదని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News